True Rental Agreements = Transparency(పారదర్శకతే నిజమైన అద్దె ఒప్పందం..)
ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు నాకు ఎదురైన అనుభవాలు, నాకు తెలిసి చాలా మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు, కొందరు యజమానులు అవసరానికి మించిన ప్రశ్నలు అడుగుతారు. వ్యక్తిగత విషయాలు, కుటుంబ వివరాలు, ఉద్యోగ స్థితి, అతిథులు ఎవరొస్తారు వంటి అంశాలు కొన్నిసార్లు పరిమితిని దాటుతాయి. ఇలాంటి పరిస్థితులపై అవగాహన కలిగించే చిన్న కథ ఇది. “పారదర్శకతే నిజమైన అద్దె ఒప్పందం” రమేష్ కొత్తగా నగరానికి ఉద్యోగం కోసం వచ్చాడు. మంచి జీతం ఉన్నప్పటికీ, అతనికి సరైన ఇల్లు దొరకడం కష్టమైంది. ఒక రోజు అతను ఒక మంచి అపార్ట్‌మెంట్ చూసేందుకు వెళ్లాడు. ఇల్లు బాగానే ఉంది. గాలి, వెలుతురు, నీటి సౌకర్యం అన్నీ సరిగ్గా ఉన్నాయి. కానీ యజమాని అడిగిన ప్రశ్నలు మాత్రం అతనికి అసౌకర్యంగా అనిపించాయి. “మీ దగ్గరకు ఎవరెవరూ వస్తారు?” “మీరు ఏ మతం?” " మీరు ఏ కులం?" “మీ స్నేహితులు ఎన్ని సార్లు వస్తారు?” “రాత్రి ఎప్పటివరకు బయట ఉంటారు?” రమేష్ ఆశ్చర్యపోయాడు. “ఇవి అద్దెకు సంబంధించిన ప్రశ్నలేనా?” అని మనసులో అనుకున్నాడు. అతను వినయంగా చెప్పాడు: “సార్, అద్దె సమయానికి చెల్లిస్తాను. ఇంటిని శుభ్రంగా ఉంచుతాను. ఒప్పందంలో ఉన్న నియమాలు పాటిస...