పట్టుదల(Determination)...
పట్టుదల... ఒకసారి ఓ యువకుడు విజయాన్ని చేరుకోవాలి అని కలలు కన్నాడు. అ ఊరిలొ ఉన్న ఒక బుద్దుమంతున్ని కలిసి విజయం కొసం ఎం చెయలి అని అడగ్గా. అ బుద్ధిమంతుడు అతనికి ఇల సమదానం చెప్పాడు. "సఫలత సాధించాలంటే ఈ కొండపై ఉన్న ఆలయం చేరుకోవాలి. అది నీ లక్ష్యం." యువకుడు వెంటనే పయనమయ్యాడు. మధ్యలో పెద్ద పెద్ద రాళ్లు, గాలులు, వర్షాలు ఎదురయ్యాయి. చాలా మంది మధ్యలోనే ఆపేసి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. కానీ ఆ యువకుడు మాత్రం ప్రతి అడుగూ ధైర్యంగా ముందుకు వేశాడు. చివరికి అతను ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ బుద్ధిమంతుడు మళ్లీ కనిపించి ఇల అన్నాడు: "నీకిప్పుడు విజయం లభించింది, ఎందుకంటే నువ్వు ప్రయాణం మధ్యలో విసిగిపోకుండా పూర్తి చేశావు. విజయానికంటే ప్రయాణమే నీకు నిజమైన గుణపాఠం." నీతి:- యువతకి — లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఓర్పు, పట్టుదల, ధైర్యం అవసరం. వెనక్కి తిరగకుండా ముందుకు సాగితేనే విజయం దక్కుతుంది.