మ్యాచ్ స్కోర్లు కాదు, మార్కులు ముఖ్యం.. #Cricket #Exams #IPL

ఒక  బీటెక్ విద్యార్థి కథ . పరీక్షలు దగ్గరపడుతున్నాయి. కానీ అదే సమయంలో Cricket(Indian Premier League) కూడా జరుగుతోంది.

అతను మొదట చాలా క్రమశిక్షణగా చదివేవాడు. కానీ మ్యాచ్‌లు మొదలయ్యాక, “ఒక్క మ్యాచ్ చూసి చదువుకుంటాను” అనుకుంటూ టీవీ ముందు కూర్చొనేవాడు. ఒక్క మ్యాచ్ రెండు అయ్యింది… రెండు మ్యాచ్‌లు నాలుగు అయ్యాయి… చివరికి చదువు పూర్తిగా పక్కన పెట్టేశాడు.

పరీక్షల రోజు వచ్చింది. ప్రశ్నపత్రం చూసి ఆశ్చర్యపోయాడు. చదివినవి చాలా తక్కువ. అతను #mobile లో చూసిన స్కోర్లు మాత్రం గుర్తున్నాయి కానీ పుస్తకాలలోని సమాధానాలు మాత్రం గుర్తుకు రాలేదు.

అతను అప్పుడు గ్రహించాడు —

“పరీక్షల సమయంలో మ్యాచ్ స్కోర్లు కాదు, నా మార్కులే నా భవిష్యత్తును నిర్ణయిస్తాయి” అని.

పరీక్షలు అయిపోయాక ఫలితాలు వచ్చాయి.  తనకి తక్కువ మార్కులు వచ్చాయి. అతని స్నేహితులు  మాత్రం మ్యాచ్‌లు చూడకుండా క్రమంగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు.

అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు —

“సరైన సమయంలో సరైన పని చేయాలి. వినోదం తర్వాత కూడా చూడవచ్చు, కానీ చదువు సమయాన్ని కోల్పోతే తిరిగి రాదు” అని.

నీతి:

పరీక్షల సమయంలో దృష్టి చదువుపై ఉండాలి. మ్యాచ్ స్కోర్లు కాదు, నీ స్కోర్ ముఖ్యం.




Comments

Popular posts from this blog

Digital marketing is the bridge between Two Parties...!!

నీ బట్టలు నీవే ఉతికితే ఏమి రాదు? పది మందివి ఉతికితే డబ్బులు వస్తాయి

True Rental Agreements = Transparency(పారదర్శకతే నిజమైన అద్దె ఒప్పందం..)